ప్రొద్దుటూరు: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి. మూడో రోజు దీక్షలో నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళా నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొని తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
Was this article useful?



