రాయచోటి, జూలై 30 (కలం మనస్సాక్షి): వైకాపా ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రాయచోటి–వేంపల్లి జాతీయ రహదారి అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించి పూర్తి దశకు తీసుకొచ్చిందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రూ.241.50 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మూడేళ్లపాటు నిలిచిపోయిందని, తమ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో కొత్త కాంట్రాక్టర్ను నియమించి పనులు వేగవంతం చేసిందన్నారు. రాయచోటి నియోజకవర్గంలో జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ కోసం మొత్తం రూ.273.15 కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు తెలిపారు. రహదారి పూర్తయితే ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు రైతులు, వ్యాపార వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.
Was this article useful?



