వేముల: మండలంలోని ముబ్బ చింతలపల్లి గ్రామ చెరువుకు పంప్‌హౌస్ నుంచి శుక్రవారం నీటిని విడుదల చేశారు. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి, టీడీపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి, మారెడ్డి జోగిరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొని చెరువుకు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చెరువులకు నీటిని అందించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ముబ్బ చింతలపల్లి చెరువుకు నీరు చేరడంతో పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గి పంటలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. చెరువులోకి నీరు చేరడంతో గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
Was this article useful?



