ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (APMEF) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు, విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. ఈ అంశాలను పరిశీలించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎన్.బి. సాగర్, ప్రధాన కార్యదర్శి దప్పెల్ల దేవదాసు తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



