జమ్మలమడుగు, సెప్టెంబర్ 3: జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు శివ, దస్తగిరిరెడ్డి, రమేష్ హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా గురువారం జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్లో సీఐ నరేష్బాబు వారిని శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుందని, విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఐ సూచించారు. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పదోన్నతి పొందిన సిబ్బందికి పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందనలు తెలిపారు.
Was this article useful?



