బద్వేలు, ఆగస్టు 5 : బి.కోడూరు మండలం ఐత్రంపేట పంచాయతీ పరిధిలోని రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన కత్తి కొండయ్యకు అనారోగ్య చికిత్స కోసం మంజూరైన రూ.1,08,997 ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల వైద్య అవసరాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



