రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమలై యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, రాయచోటి వైఎస్సార్సీపీ నాయకులు సుగవాసి శ్యామ్, సబ్బీర్లు ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయ్యప్ప స్వామి దర్శనం ప్రశాంతంగా పూర్తై, యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. స్వామివారి అనుగ్రహంతో ఎంపీ మిథున్ రెడ్డి క్షేమంగా తిరిగి రావాలని నాయకులు కోరుకున్నారు.
Was this article useful?



