జమ్మలమడుగు: మాల మహానాడు ఆధ్వర్యంలో ఆదివారం జమ్మలమడుగులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎల్ఎంసీ స్కూల్ గ్రౌండ్లో జరిగిన సభలో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ మాలలను అణిచివేయాలని చూస్తున్న వారికి రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెబుతామని అన్నారు. మాలల హక్కులు, సంక్షేమం కోసం ఉద్యమాన్ని జమ్మలమడుగు నుంచే మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాల సంక్షేమ ఐక్య వేదిక అధ్యక్షులు కోట్ల గంగాధర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



