చక్రాయపేట: మండలంలోని రెడ్డివారిపల్లె మాలపల్లెలో రాధా అనే మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఆమె భర్త నాగార్జునపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న చక్రాయపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Was this article useful?



