ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మార్కెట్ యార్డును పరిశీలించారు. యార్డు ప్రహరీ గోడ, నీటి పైప్‌లైన్ లీకేజీతో పాటు ఆవరణలోని ఇతర సదుపాయాలను పరిశీలించి, అవసరమైన పనులను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులను మెరుగుపరచాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఇన్చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్‌కుమార్, కార్యదర్శి రత్నంరాజు, కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
Was this article useful?



