వేంపల్లె: స్థానిక వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కే. ఉషశ్రీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై చూపే ప్రభావాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. షాజియా బేగం, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు, మై భారత్ సమన్వయకర్త రాజారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Was this article useful?



