ప్రొద్దుటూరు, ఆగస్టు 19: గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెన్నానగర్లో వన్‌టౌన్ సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో EAGLE టీమ్‌తో కలిసి మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యంతో పాటు కుటుంబ, సామాజిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గంజాయి విక్రయాలు, సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, EAGLE టీమ్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు



