పులివెందుల, సెప్టెంబర్ 1: మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని వెలుగు ఏపీఎం ఆంజనేయులు సూచించారు. రుణాలను పాడి పరిశ్రమ, పశుపోషణ, వ్యవసాయం, చిన్న వ్యాపారాల వంటి జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకోవాలని తెలిపారు. మహిళా సంఘాలకు రూ.40 లక్షల రుణాలు మంజూరైనట్లు పేర్కొన్నారు. రుణాలను సకాలంలో చెల్లిస్తూ పొదుపులు కొనసాగించాలని, సంఘాల బలోపేతానికి సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Was this article useful?



