Breaking

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌

జమ్మలమడుగు: మహిళల సంక్షేమం, ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ అన్నారు. జమ్మలమడుగు మహిళా కళాశాలలో బుధవారం నిర్వహించిన ‘మహిళా బాగు.. సంభాషణ’ కార్యక్రమంలో కలెక్టర్‌, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను మహిళలు సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి పొందిన రుణాలను సక్రమంగా చెల్లించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు.
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల నాటికి జమ్మలమడుగులో రోడ్ల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పట్టణంలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. బాల్యవివాహాలను అరికట్టి, పిల్లలకు సరైన వయసులో వివాహాలు చేయాలని మహిళలకు సూచించారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.