జమ్మలమడుగు: మహిళలు, బాలికలపై నేరాల నివారణ, మహిళా భద్రత, బాల్య వివాహాల నిరోధం, హెల్ప్‌లైన్ నంబర్లు, కమ్యూనిటీ పోలీసింగ్, శక్తి యాప్‌పై నర్సింగ్ విద్యార్థులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జమ్మలమడుగు డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అర్బన్ సీఐ నరేష్‌బాబు మాట్లాడుతూ మహిళలు, బాలికలు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. అత్యవసర సమయంలో అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను, శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓ, లీగల్ అడ్వైజర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థినులు పాల్గొన్నారు.
Was this article useful?



