ప్రొద్దుటూరు: వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మట్కా రాస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో మట్కా నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ జి. మధుసూదన్‌రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సందర్భంగా షేక్ ఖాదిర్, దేవరగుంట్ల దస్తగిరి, దూదేకుల దస్తగిరి, కాకర్ల దస్తగిరిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు మట్కా స్లిప్పులు, రూ.9 వేల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు
Was this article useful?



