చిన్నమండెం, ఆగస్టు 7: కడప నూతన ఆర్టీసీ ఈడీగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ కిషోర్ శుక్రవారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కృష్ణ కిషోర్ మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఇరువురు పరస్పరం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కడప జిల్లాలో ఆర్టీసీ ఈడీగా తన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షిస్తూ కృష్ణ కిషోర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Was this article useful?



