పులివెందుల: పాఠశాల, కళాశాలల వేళల్లో ఆర్టీసీ బస్సులు రాయలాపురం వద్ద నిలపడం లేదంటూ విద్యార్థులు, ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ప్రొద్దుటూరు–పులివెందుల మార్గంలో నడిచే బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. బస్సులు సమయానికి అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు విద్యాసంస్థలకు ఆలస్యంగా చేరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటంతో అదనంగా ఎక్కించుకోలేకపోతున్నామని కండక్టర్లు చెబుతున్నారని తెలిపారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాయలాపురం వద్ద బస్సులు తప్పనిసరిగా నిలిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Was this article useful?



