Breaking

బద్వేల్‌లో ఇంటింటికి కూటమి ప్రభుత్వం ప్రచారం

బద్వేలు, ఆగస్టు 6 : బద్వేలు పట్టణంలోని 12వ వార్డు (శివనగర్)లో గురువారం నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” ప్రచార కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీ, ‘తల్లికి వందనం’, ఉచిత ఇసుక, చేనేత కార్మికులకు రాయితీలు వంటి పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.