ప్రొద్దుటూరు: రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వరస్వామి ఆలయ భూముల వేలంపాటను అడ్డుకునేందుకు ప్రయత్నించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన రౌడీషీటర్ పాతకోట వినోద్‌కుమార్‌రెడ్డిని వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆలయ ఈవో శ్రీధర్ అభ్యర్థన మేరకు ఇన్స్పెక్టర్ టీవీ కొండారెడ్డి ఆధ్వర్యంలో వేలంపాట వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సమయంలో వేలంపాటను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వినోద్‌కుమార్‌రెడ్డి పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి, హెడ్ కానిస్టేబుల్ దస్తగిరిపై బండరాయితో దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ విబుకృష్ణ ఐపీఎస్ హెచ్చరించారు.



