Breaking

ప్లాస్టిక్‌ నివారణకు ఆటో డ్రైవర్ల మద్దతు

ప్రొద్దుటూరు: పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ సంకల్ప దీక్షకు ప్రొద్దుటూరు ఆటో డ్రైవర్లు మద్దతు తెలిపారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ ఆటోలకు ప్లాస్టిక్‌ నివారణకు సంబంధించిన స్టిక్కర్లను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ తూతీక శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ స్వయంగా ఆటో నడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్‌ నివారణకు ఆటో డ్రైవర్లు అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. పట్టణ పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజలు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని కోరారు. ప్రొద్దుటూరును పరిశుభ్రమైన, ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా మార్చేందుకు అందరి సహకారం అవసరమని కమిషనర్‌ పేర్కొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.