ప్రొద్దుటూరు: టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరద మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు. తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నికలపై వరద విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు రాచమల్లు తెలిపారు. తన కుమారుడు రాఘవేంద్రారెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు సిద్ధమని ప్రకటించారు. వరద కూడా తన కుమారుడు కొండారెడ్డిని ఇండిపెండెంట్‌గా పోటీకి దించాలని సవాల్ చేశారు. ప్రజాక్షేత్రంలో ఎవరి బలం ఎంతో ఎన్నికల ద్వారా తేల్చుకుందామని అన్నారు.
Was this article useful?



