Breaking

ప్రొద్దుటూరులో వైసీపీ జైత్రయాత్రే లక్ష్యం పోరెడ్డి నరసింహారెడ్డి .

35 వార్డుల్లో విజయం సాధిస్తామంటున్న చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి

ప్రొద్దుటూరు: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల సహకారంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయాన్ని సాధిస్తారని ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని 52 వార్డుల్లో పోటీ చేసి, కనీసం 35 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తనను అభ్యర్థిగా ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు, ఓదార్పు యాత్ర, పాదయాత్రల్లో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేశానని పేర్కొన్నారు. 2019–2024 మధ్య ప్రొద్దుటూరులో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ అనుబంధ కమిటీలకు చెందిన సుమారు 10,150 మంది నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పోరెడ్డి నరసింహారెడ్డి వెల్లడించారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.