కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఉటుకూరు వీరయ్య ఉన్నత పాఠశాలలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నశాముక్త భారత్ (మాదకద్రవ్య రహిత భారత్) అభియాన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు సి.వి. అమర్నాథ్ రెడ్డి, ఓం శాంతి భవన్ నిర్వాహకులు బీకే శాంత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీకే శాంత మాట్లాడుతూ, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచి విలువలతో కూడిన సమాజ నిర్మాణమే ఈ అభియాన్ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులతో వ్యసన రహిత ప్రతిజ్ఞ చేయించి రాజయోగ ధ్యానం నిర్వహించారు.
ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలతో పాటు సెల్ఫోన్, టీవీ వంటి వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలని, మంచి స్నేహాలను అలవర్చుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా వ్యసనాల నుంచి దూరంగా ఉండేలా చైతన్యం కల్పించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో యోగా ట్రైనర్ వాసు, బీకే సౌజన్య, శేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



