ఎర్రగుంట్ల: జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ‘రెండేళ్ల కూటమి ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమం.. ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎర్రగుంట్ల మార్కెట్ యార్డు చైర్మన్ నాగరాజు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు



