పులివెందుల: పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి తెలిపారు. బయమ్మతోట కాలనీలో బోరు మోటార్ కాలిపోవడంతో తాగునీటి ఇబ్బందులు తలెత్తగా, వెంటనే స్పందించి మోటార్‌ను మరమ్మతు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు.
అదేవిధంగా కాలనీలో చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా రావడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా, మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే ఎంపీతో మాట్లాడి నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు హాల్ గంగాధర్‌రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు పర్ణపల్లి కిషోర్‌తో పాటు వైఎస్సార్సీపీ నాయకులు శేఖర్, సుభాష్, హరి పాల్గొన్నారు.



