బద్వేలు, ఆగస్టు 20: బద్వేలు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి గురువారం ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు వివరించిన సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



