పులివెందుల: పులివెందుల టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ప్రజా దర్బార్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో క్యాడర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, వినతులను ఆయన నేరుగా స్వీకరించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
అనంతరం రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వార్డు స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజలతో నిరంతర సంబంధాలు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



