Breaking

ప్రజా దర్బార్‌లో సమస్యల వెల్లువ

జమ్మలమడుగు: టీడీపీ కార్యాలయంలో సోమవారం కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్‌ సుబ్బరామిరెడ్డి ప్రజా దర్బార్‌ నిర్వహించారు. వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఆయనకు అందజేశారు. గొల్లపల్లిలో విద్యుత్‌ స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేయాలని, కర్మలవారిపల్లెలో ఆశా వర్కర్‌ను నియమించాలని కోరారు. నార్జంపల్లెలో సిమెంట్‌ రోడ్డు, శుద్ధపల్లిలో హిందూ శ్మశానవాటికకు మౌలిక వసతులు, ప్రహరీ గోడ నిర్మించాలని వినతులు అందాయి. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని భూపేష్‌ సుబ్బరామిరెడ్డి హామీ ఇచ్చారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.