ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై స్పందించే కార్యకర్తలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాయచోటి మున్సిపాలిటీలోని 23వ వార్డులో వివిధ హోదాలు పొందిన పార్టీ శ్రేణులకు ఆయన గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ పదవి కేవలం గుర్తింపు కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని, వార్డు స్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్టూడియో బాబ్జి, నరసింహులు, ఇలియాస్, అక్బర్, చాను, అలీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



