ప్రొద్దుటూరు: ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి శనివారం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులు, ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. ప్రజల సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి ప్రజలు, వ్యాపారుల నుంచి మంచి స్పందన లభించిందని టీడీపీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ పెద్దలు పాల్గొన్నారు.
Was this article useful?



