Breaking

ప్రజలకు నిరంతరం అందుబాటులో మంత్రి మండిపల్లి

రాయచోటి, సెప్టెంబర్ 28 (కలం మనస్సాక్షి ప్రతినిధి) : రాయచోటి టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలు, వినతులను మంత్రి స్వయంగా స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.