పులివెందుల: పట్టణ నూతన ఎస్సైగా ఎం. సుభాన్ గురువారం పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా విధులు నిర్వహిస్తామని, పోలీస్ స్టేషన్ పరిధిలో గొడవలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.
Was this article useful?



