అమరావతి: ఏపీ శాసనసభ ప్యానల్ స్పీకర్లుగా ఆరుగురిని ఎంపిక చేశారు. ఇందులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి కూడా చోటు దక్కింది. మండలి బుద్ధప్రసాద్, కోళ్ల లలితకుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్‌రాజు, వరదరాజులరెడ్డి, దాసరి సుధలను ప్యానల్ స్పీకర్లుగా ప్రకటించారు. సభా కార్యక్రమాల నిర్వహణలో స్పీకర్‌కు సహకరించే బాధ్యతలను ప్యానల్ స్పీకర్లు నిర్వర్తించనున్నారు. వరదరాజులరెడ్డికి ఈ అవకాశం దక్కడంపై కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Was this article useful?



