బద్వేలు, ఆగస్టు 5: పోరుమామిళ్ల చెరువును బ్రహ్మసాగర్ నుంచి తక్షణమే పూర్తిస్థాయిలో నీటితో నింపి రైతులకు సాగునీరు అందించాలని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆమెను కలిసి, ప్రస్తుతం విడుదల చేస్తున్న నీరు చెరువు నిండేందుకు సరిపోవడం లేదని, నాట్ల సీజన్లో నీటి కొరతతో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన విజయమ్మ, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆలస్యం చేయకుండా చెరువుకు తగినంత నీరు విడుదల చేసి సాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Was this article useful?



