పోరుమామిళ్ల: పట్టణం మీదుగా లారీలో గోవులు, బర్రెలు, ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని బీజేపీ నాయకులు శనివారం అడ్డుకున్నారు. మైదుకూరు రోడ్డులోని మద్దిమాను గురప్పస్వామి ఆర్చ్ వద్ద లారీని గుర్తించిన బీజేపీ నాయకులు వాహనాన్ని నిలిపివేసి తనిఖీ చేశారు. అనంతరం లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు బుసిరెడ్డి మనోహర్‌రెడ్డి, ఎదురు భాస్కర్‌రెడ్డి, ఎదురు శిరీష, చల్లా భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు మరింత పటిష్టం చేయాలని నాయకులు కోరారు. అక్రమంగా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Was this article useful?



