పోరుమామిళ్ల: ప్రముఖ సినీ నిర్మాత దిల్రాజు, యువ హీరో వంశీకృష్ణ గురువారం పోరుమామిళ్లకు రానున్నారు. జె.ఎస్.ఆర్. నగర్లోని శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి దేవస్థానంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వారు పాల్గొననున్నారు. ఆలయ స్థలదాత, నిర్మాణ వ్యవస్థాపకులు జడపోలు శ్రీరామ్ కుమారుడే హీరో వంశీకృష్ణ కావడంతో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
Was this article useful?



