ముద్దనూరు: జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ముద్దనూరు మండలం పెద్దదుద్యాల గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ చోరీ ఘటన కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సింగం ప్రసాద్‌రెడ్డి పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి, అందులోని ఆయిల్‌తో పాటు కాపర్ వైర్లను అపహరించినట్లు సమాచారం. ఉదయం ఘటనను గుర్తించిన రైతు పోలీసులకు సమాచారం అందించారు. ముద్దనూరు పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం దర్యాప్తు చేపట్టారు.
Was this article useful?



