పులివెందుల, సెప్టెంబర్ 21: పులివెందుల సాయిబాబా ఆలయ ఆవరణలో డ్వాక్రా మహిళలకు ఆర్థిక వ్యవహారాలు, పొదుపు, బీమా పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు కేంద్ర ప్రభుత్వ ప్రమాద బీమా, జీవన్‌జ్యోతి బీమా, అటల్ పెన్షన్ యోజన పథకాల ప్రయోజనాలను వివరించారు. బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనుకోని ప్రమాదాలు, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల సమయంలో భరోసా పొందవచ్చని సూచించారు. ఆర్థిక లావాదేవీలపై అవగాహన పెంచుకుని పొదుపు అలవాటును కొనసాగించాలని మహిళలకు సూచించారు. కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు, ఆర్థిక అక్షరాస్యత సిబ్బంది పాల్గొన్నారు.
Was this article useful?



