Breaking

పేదలు, రైతుల సమస్యలు పరిష్కరించాలి

పులివెందుల: పేదలు, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ BKMU ఆధ్వర్యంలో పులివెందుల ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకటరాములు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం అందించాలని, భూమిలేని వారికి సాగుభూమి పంపిణీ చేయాలని కోరారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో పనిదినాలు పెంచి కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో BKMU నాయకులు నరేంద్ర, బ్రహ్మం, సీపీఐ నాయకులు సుభాన్ భాష తదితరులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.