రాయచోటి: శివాలయం సమీపంలో పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అర్బన్ ఎస్ఐ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు. వారి వద్ద నుంచి రూ.9,300 నగదు, 14 సెల్ఫోన్లు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Was this article useful?



