ప్రొద్దుటూరు: పట్టణంలోని గిడ్డంగి వీధిలో పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై వన్‌టౌన్ పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.96,520 నగదు, ఎనిమిది సెల్ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. పేకాట నిర్వాహకులు ముందస్తు ప్రణాళికతో జూదం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జిల్లా ఎస్పీ పెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ యు. విభు కృష్ణ, ఐపీఎస్ పర్యవేక్షణలో వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ టి.వి. కొండారెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. ఎస్ఐ జి. మధుసూదన్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కేసు ఛేదనలో కృషి చేసిన పోలీసులను ఎస్పీ, ఏఎస్పీలు అభినందించారు



