Breaking

పులివెందుల మెగా వాటర్‌గ్రిడ్‌కు జోష్

పులివెందుల, ఆగస్టు 24: పులివెందుల నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మెగా వాటర్‌గ్రిడ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు. జల్‌జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకాల కింద సుమారు రూ.280 కోట్లతో చేపట్టిన పనులు 96 శాతం పూర్తయ్యాయి.
మొత్తం 1,111 కిలోమీటర్ల పైప్‌లైన్‌కు గాను 1,106 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. 65 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి ప్లాంట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. పులివెందుల పట్టణం, గ్రామీణ ప్రాంతాలు, సింహాద్రిపురం మండలాల్లో పనులు పూర్తికాగా, లింగాల మండలంలోని 24 ఆవాసాలకు తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తోంది. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.