పులివెందుల: లింగాల మండలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి పలు చర్యలు చేపట్టినట్లు జనసేన నాయకులు భరత్‌రెడ్డి తెలిపారు. పాన్పల్లె కుడి కాలువ ద్వారా లోపట్లంతల, రామట్లపల్లె చెరువులకు నీటిని అందించి కరువు పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
గుణకనపల్లె తదితర గ్రామాల్లో నీటి కొరతను గుర్తించి కొత్త బోర్లు ఏర్పాటు చేసి పంపింగ్ ద్వారా నీటిని అందించామని పేర్కొన్నారు. పెద్దకుడాల, చిన్నకుడాల, అంకాలమ్మగూడూరు తదితర గ్రామాలకు సాగునీటి వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సుమారు రూ.290 కోట్లతో పులివెందుల నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీటి ట్యాంకులు నిర్మించి శుద్ధి చేసిన నీటిని అందించే పనులు కొనసాగుతున్నాయని, త్వరలో జలజీవన్ మిషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భరత్‌రెడ్డి చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం లింగాల మండలంలోని రైతులు, ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని భరత్‌రెడ్డి కోరారు.



