పులివెందుల, సెప్టెంబర్ 2:
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పులివెందులలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ హరీష్ ఆధ్వర్యంలో వేంపల్లి నుంచి పులివెందుల వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Was this article useful?



