పులివెందుల మున్సిపాలిటీలోని పీడబ్ల్యూసీ (PWC) కాలనీలో నిర్వహించిన “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తూగుట్ల మధుసూదన్ రెడ్డి, అక్కులుగారి విజయ్ కుమార్ రెడ్డి, అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, మహబూబ్ బాష, పుష్పానాథ్ రెడ్డి, ఓబుల్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
Was this article useful?



