కొయ్యూరు మండలంలోని 12 పంచాయతీల గిరిజన ప్రజలకు పిల్లల వ్యాక్సిన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కోరారు. ప్రస్తుతం కొండగోకిరి, రత్నంపేట, కినపర్తి, రావణపల్లి, నల్లగొండ, అంతడా, బంగారంపేట, బట్టపనుకులు, నడింపలెం, వెలగలపాలెం, శరభన్నపాలెం తదితర పంచాయతీలకు కొయ్యూరు నుంచి వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. గతంలో కేడీపేట పీహెచ్‌సీలోనే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేవని, జిల్లాల పునర్విభజనతో కేంద్రం మారడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొండ ప్రాంతాల నుంచి కొయ్యూరుకు రవాణా, సమయం సమస్యల కారణంగా చిన్నారులకు నిర్ణీత సమయంలో వ్యాక్సిన్లు వేయించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేడీపేట పీహెచ్‌సీలోనే వ్యాక్సిన్లు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సంపరి శివకుమార్, అరిమెల రాజు, డీవీడీ ప్రసాద్, గుర్రం సునీల్ పాల్గొన్నారు.



