Breaking

పికిల్‌బాల్‌కు ప్రోత్సాహం.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం

తాడేపల్లి, ఆగస్టు 7: రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న అమరావతి పికిల్‌బాల్ లీగ్ (AMPL) ప్రారంభోత్సవ కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడలోని నైట్రో పికిల్‌బాల్ అండ్ కేఫే వేదికగా ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు లీగ్ పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పికిల్‌బాల్ క్రీడ అభివృద్ధికి ఈ లీగ్ కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు పికిల్‌బాల్ వంటి నూతన క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్రీడలతో యువత ఆరోగ్యంగా, చురుగ్గా ఉండటంతో పాటు రాష్ట్రంలో క్రీడా సంస్కృతి మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామోహన్ నాయుడు, శాప్ చైర్మన్ రవి నాయుడు, సినీహీరో సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.