ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 9: పట్టణంలోని 7వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ బుధవారం ముఖాముఖి మాట్లాడారు. వార్డులో పర్యటించిన ఆయన దరఖాస్తుదారుల నుంచి పింఛన్ దరఖాస్తుల స్థితి, ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యం లేకుండా అర్హులైన వారికి త్వరితగతిన ప్రయోజనం అందేలా చూడాలని సూచించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు వార్డు పర్యటనలు కొనసాగిస్తామని కమిషనర్ తెలిపారు.
Was this article useful?



