రాజంపేట, సెప్టెంబర్ 2: జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజంపేటలో జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్, మార్కెట్, ఆర్అండ్బీ బంగ్లా మీదుగా తోట కళ్యాణ మండపం వరకు సాగింది.
అనంతరం కళ్యాణ మండపంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజాసేవకు జనసేన శ్రేణులు అంకితమై పనిచేస్తాయని అతికారి కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Was this article useful?



